Monday, 02 November 2026 06:15:21 PM
# అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

బస్సు, కాగడా గుర్తులకు ఓటెయ్యండి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 06 October 2026 08:54 PM Views : 130

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బస్సు, కాగడా గుర్తులకు ఓటెయ్యండి. కార్మిక సంక్షేమానికి భరోసా ఈయూ, ఎన్ఎంయూ.ఎర్రజెండా అండతోనే సమస్యల పరిష్కారం.ఓటుతో కార్మిక ఐక్యతను చాటిచెప్పాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. టీజీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బస్సు, కాగడా గుర్తులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్‌కు సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందని, ఎన్నో త్యాగాలు చేసి కార్మికులకు అనేక హక్కులు, విజయాలు సాధించిపెట్టిన ఘనత ఎర్రజెండాకే దక్కుతుందని కొనియాడారు. సంస్థను నమ్ముకుని నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులు, ఉద్యోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే శరణ్యమన్నారు. రాబోయే 9వ తేదీన జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లు కలిసి ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయని తెలిపారు. కార్మిక పక్షాన నిలిచే ఈ కూటమిని తిరుగులేని మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘానికి క్లాజ్-3 కింద పోటీ చేస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ 'బస్సు' గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అలాగే ఖమ్మం రీజియన్ స్థాయిలో క్లాజ్-6 కింద బరిలో ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్ 'కాగడా' గుర్తుపై ఓటు వేసి విజయదుందుభి మోగించాలని పిలుపునిచ్చారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరంతరం పోరాడే శక్తులకు అండగా నిలవాలని ఆయన కోరారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కందుల భాస్కర్, నాయకులు కంచర్ల జమలయ్య, నేరెళ్ల రమేష్, ఈయూ, ఎన్ఎంయూ రాష్ట్ర, జిల్లా నాయకులూ ఎస్ బాబు, మౌలానా, థామస్ రెడ్డి, పిల్లి రమేష్, టివి ప్రసాద్, ఎస్ డి నజీర్, ఆర్ యెన్ సింగ్, హరివర్మ, జిసి శేఖర్, ఖాజామొహినుద్దీన్, జి రాజు, రేణుకాదేవి, రాధాదేవి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :