Monday, 02 November 2026 09:57:15 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

తెలంగాణ ముద్దుబిడ్డకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం.రాష్ట్రీయ హరిత గౌరవ పురస్కారానికి ఎంపికైన బాల ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్.

Date : 22 September 2026 02:31 PM Views : 166

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అవార్డు కోసం వెళ్లే ఖర్చుతో మొక్కలు నాటుతా.. అవార్డులు కాదు పచ్చదనమే పెంచడమే ముఖ్యం అంటున్న ప్రకృతి ప్రేమికుడు చౌహాన్. పర్యావరణ పరిరక్షణలో తనదైన ముద్ర వేస్తూ, చిన్న వయసులోనే పెద్ద లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ బాల ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ కు అరుదైన జాతీయ గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక "రాష్ట్రీయ హరిత గౌరవ పురస్కార్ 2026" (National Green Pride Award) కు ఎంపికయ్యాడు.రాజస్థాన్ కేంద్రంగా 40 ఏళ్లుగా పర్యావరణ సేవలో తలమునకలై, కోట్లాది మొక్కలు నాటి "ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా"* గా పేరుగాంచిన శ్రీ విష్ణు లాంబా ఆధ్వర్యంలోని కల్పతరు సంస్థాన్ ఈ అవార్డులను అందజేస్తోంది. ఈ నెల 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జైపూర్ లోని కనోరియా పీజీ మహిళా మహావిద్యాలయ ఆడిటోరియం, JLN మార్గ్ లో* జరిగే "పర్యావరణ మహాకుంభ్" కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి ఎంపికైన 25 మంది ప్రకృతి ప్రేమికులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, కేంద్ర మంత్రులు, ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.గతంలో ఈ పురస్కారాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అందుకోవడం విశేషం. ఈ పురస్కారాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ హరిబావు భాగ్డే చేతుల మీదుగా అందుకున్నారు అవార్డు కార్యక్రమంలో గతంలో మరో గవర్నర్ కల్రాజ్ మిశ్రా పాల్గొని అవార్డులు ప్రధానం చేశారు అటువంటి ప్రతిష్టాత్మక జాబితాలో చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ చోటు దక్కించుకోవడం తెలంగాణకు గర్వకారణం.అయితే ఈ సందర్భంగా విశ్వామిత్ర చౌహాన్ చూపిన నిబద్ధత అందరినీ ఆలోచింపజేస్తోంది. జైపూర్ వెళ్లి రావడానికి ప్రయాణ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, ఆ ఖర్చుతో అవార్డు కోసం వెళ్లడం కంటే, ఆ డబ్బులతో అన్ని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుతానని తనకు అవార్డులు, రివార్డులు ముఖ్యం కాదని, పచ్చదనం పెంచడమే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశాడు. అవార్డు కంటే ఆలోచన గొప్పదన్న ఈ బాలుడి మాట నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం.అయినప్పటికీ నిర్వాహకులు విశ్వామిత్ర కోసం ప్రత్యేకంగా ప్రయాణ ఖర్చులు తాము భరించి ఆహ్వానించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలతో, భావి తరాలకు పచ్చని భవిష్యత్తును అందించాలనే తపనతో ముందుకు సాగుతున్న విశ్వామిత్ర చౌహాన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :