తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆదివారం ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకునే విషయంలో మహిళా ప్రయాణికురాలు బస్ కండక్టర్‌తో గొడవకు దిగింది. ఈ క్రమంలో మిట్టగూడెం సమీపంలో సదరు మహిళ కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేయడంతో, కండక్టర్ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో కాళ్లకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితురాలు బానోత్ మౌనిక (నివాసం: మిట్టగూడెం, అశ్వాపురం)ను సోమవారం అరెస్టు చేసి మణుగూరు కోర్టులో హాజరుపరిచారు.
Admin
తెలుగు వెలుగు టీవీ