తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖజానా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐఎఫ్‌ఎంఐఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పై నిర్వహించిన జిల్లా స్థాయి కాస్కేడింగ్ శిక్షణ కార్యక్రమం ఐడీఓసీ సమావేశ మందిరంలో విజయవంతంగా ముగిసింది. డిజిటల్ ఆర్థిక పరిపాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా జరిగిన ఈ శిక్షణకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 450 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు.ఈ శిక్షణలో భాగంగా ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-శాంక్షన్ మాడ్యూల్స్ వినియోగ విధానాలు, ఆన్‌లైన్ ప్రక్రియలపై ప్రాక్టికల్ డెమో ద్వారా ఉద్యోగులకు సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లా ఖజానా అధికారి జక్కా మీనాక్షి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణను విజయవంతం చేసినందుకు జిల్లా ఖజానా శాఖ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.
Admin
తెలుగు వెలుగు టీవీ