తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఉపాధి కల్పనా శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తీపి కబురు అందించారు. భారత్ హ్యుందాయ్ (భారత్ మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్), కొత్తగూడెం సంస్థలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మొత్తం 18 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 07-11-2026 (శనివారం) నాడు ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో నేరుగా ఇంటర్వ్యూలు (జాబ్ మేళా) నిర్వహించనున్నారు.అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు శనివారం ఉదయం 10:00 గంటల కల్లా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై పేరు నమోదు చేసుకోవాలని కోరారు.పోస్టుల వివరాలు, అర్హతలు: 1. సేల్స్ కన్సల్టెంట్స్ (Sales Consultants) – 16 పోస్టులు విద్యార్హత: ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ. (అభ్యర్థికి ద్విచక్ర వాహనం మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి). వయోపరిమితి: 22 నుండి 30 సంవత్సరాలు. జీతం: రూ. 18,000 + ఇన్సెంటివ్స్ + వేరియబుల్ పే. పనిచేయాల్సిన ప్రాంతాలు: కొత్తగూడెం (10), భద్రాచలం (4), పాల్వంచ (4), మణుగూరు (4). 2. సర్వీస్ అడ్వైజర్స్ (Service Advisors) – 02 పోస్టులు విద్యార్హత: డిప్లొమా ఇన్ డీజిల్ మెకానిక్ లేదా బి.టెక్ మెకానిక్. వయోపరిమితి: 21 నుండి 30 సంవత్సరాలు.జీతం: రూ. 12,000 + ఇన్సెంటివ్స్. పనిచేయాల్సిన ప్రాంతం: కొత్తగూడెం (02).ఇంటర్వ్యూ వేదిక మరియు వివరాలు:తేదీ: 07-11-2026 (శనివారం) సమయం: ఉదయం 10:00 గంటల నుండి వేదిక: భారత్ హ్యుందాయ్, జూడియో స్టోర్ ఎదురుగా, మెయిన్ రోడ్, విద్యానగర్ కాలనీ, కొత్తగూడెం. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ (HR Cell): 703690290
Admin
తెలుగు వెలుగు టీవీ