తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను ముమ్మరంగా నిర్వహించి, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ పేరును ఓటరు జాబితాలో చేర్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. చుంచుపల్లిలోని రజబ్ అలీ భవన్లో గురువారం నిర్వహించిన సీపీఐ పక్ష స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల నమోదుకు ఒక్క రోజే గడువు ఉన్నందున ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. అలాగే, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరుస తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా అధికారులపై ఒత్తిడి తేవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మేయర్ మూడ్ గణేష్ మరియు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ