తెలుగు వెలుగు టీవీ - రాజకీయ / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు (06.08.2026 - ఉదయం 11:00 గంటలకు IDOC S20 Meeting Hall) లో భూ భారతి రిజిస్ట్రేషన్ & సక్సెషన్ మాడ్యూళ్లపై శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆకిత్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై, భూ భారతి చట్టం, నూతన నిబంధనలు, భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, ప్రజలకు వేగవంతమైన సేవల అందింపు, ప్రతి దరఖాస్తును చట్టబద్ధంగా పరిశీలించి బాధ్యతాయుతంగా సేవలు అందించాల్సిన అవసరంపై అధికారులకు విలువైన సూచనలు చేశారు.అనంతరం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనంత రామకృష్ణ, భూ భారతి రిజిస్ట్రేషన్ మరియు సక్సెషన్ మాడ్యూళ్ల అమలు విధానం, పత్రాల పరిశీలన, భూ భారతి వ్యవస్థలో అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లాలోని మండల స్థాయి జూనియర్ అసిస్టెంట్లు, డివిజన్ స్థాయి జూనియర్ అసిస్టెంట్లు మరియు కలెక్టరేట్ జూనియర్ అసిస్టెంట్లు పాల్గొని భూ భారతి మాడ్యూళ్లపై సమగ్ర అవగాహన పొందారు.శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ (టెక్నికల్ మేనేజర్స్ – HHP) గా:ఎన్. దిలీప్ కుమార్ – కలెక్టరేట్.టి. రాజేష్ – కొత్తగూడెం డివిజన్.ఎస్. సత్యేంద్ర కుమార్ – భద్రాచలం డివిజన్. భూ భారతి రిజిస్ట్రేషన్ మరియు సక్సెషన్ మాడ్యూళ్లను ప్రదర్శిస్తూ, వ్యవస్థలో అనుసరించాల్సిన ప్రతి దశను సవివరంగా వివరించి శిక్షణ అందించారు.ఈ కార్యక్రమం ద్వారా భూ భారతి వ్యవస్థను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన మరియు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించేందుకు అవసరమైన అవగాహన కల్పించబడింది.
Admin
తెలుగు వెలుగు టీవీ