తెలుగు వెలుగు టీవీ - రాజకీయ / కొత్తగూడెం : మండల పరిధిలోని బాబు క్యాంప్ ఎంపీటీసీ కూసాన వీరభద్రం పదవీకాలం ముగియటంతో మండల పరిషత్ కార్యాలయంలో శ్రేయోభిలాషులు , వివిధ పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా వారిని ఘనంగా సన్మానించారు .
ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి బాబు క్యాంపు పంచాయతీలో పార్టీలకతీతంగా అనేక అభివృద్ధి పనులు చేశానని ఆయన అంటూ , ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ప్రజా సమస్యల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని , గత ఐదు సంవత్సరాల నుండి సహకరించిన గ్రామ ప్రజలకు , అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు . అనంతరం పలువురు ఆయనను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు
Admin
తెలుగు వెలుగు టీవీ